గుండెపోటుతో అగ్రిగోల్డ్ డైరెక్టర్ అవ్వా భాస్కరరావు మృతి 

ఆకర్షణీయమైన వడ్డీలు చెల్లిస్తామంటూ 8 రాష్ట్రాలకు చెందిన దాదాపు 32 లక్షల మంది నుంచి రూ. 6.5 వేల కోట్ల డిపాజిట్ సేకరించిన అగ్రిగోల్డ్ సంస్థ వారందరినీ ముంచింది. ఏళ్లు గడుస్తున్నా ఈ కేసు ఇంకా తేలలేదు. బాధితులకు న్యాయం జరగలేదు. తాజాగా ఈ సంస్థ డైరెక్టర్ అవ్వా ఉదయభాస్కరరావు (56) నిన్న గుండెపోటుతో మృతి చెందారు. గుండె నొప్పితో కుప్పకూలిన ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.

అగ్రిగోల్డ్ డిపాజిట్ల కేసులో ఆ సంస్థ డైరెక్టర్లను ఈడీ అరెస్ట్ చేసింది. అయితే, ఆ తర్వాత వారు బెయిలుపై బయటకు వచ్చారు. కాగా, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కర్ణాటక, తెలంగాణలో అగ్రిగోల్డ్‌కు ఉన్న దాదాపు రూ. 4,109 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. కేసు ఇంకా దర్యాప్తు దశలోనే ఉంది.

Agri Gold
Director
Andhra Pradesh
Telangana

More Telugu News